Mississippi coronavirus: Gov Tate Reeves orders statewide mask mandate

కరోనా వైరస్ ప్రారంభ దశలో లాక్ డౌన్ సరిగ్గా అమలు చేయలేదు అని మరియు జూలై 1 నాటికి రాష్ట్రం మొత్తం పునఃప్రారంభించటాన్ని ప్రోత్సహిస్తున్నారు అని విమర్శలు ఎదురుకున్న మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ మిస్సిస్సిప్పి లో సోమవారం 3 ఆగస్టు న షుమారుగా ఎనిమిది కొత్త కరోనా వైరస్ మరణాలు , 572 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవ్వగా మంగళవారం 4 ఆగస్ట్ మిస్సిస్సిప్పి రిపబ్లికన్ గవర్నర్ టేట్ రీవ్స్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మాస్క్ తప్పని సరిగా ధరించాలి అని ఆదేశాలు జారీచేశారు మరియు కరోనా వైరస్ సంక్షోభాలను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎనిమిది కౌంటీస్ లో విద్యా సంవత్సరం ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

విద్యా సంస్థలు ప్రారంభం అయ్యిన కౌంటీస్ లో విధ్యార్థులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ తప్పని సరిగా ధరించాలి అని ఆదేశించారు. విద్యాసంస్థలలో ఫుట్బాల్ తిరిగి ప్రారంభం కావాలి అన్న , మిస్సిస్సిప్పి లో తిరిగి పాత రోజులు రావాలి అంటే మాస్క్ ధరించటం తప్పనిసరి అని మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.