Tollywood celebs share love for siblings on Raksha Bandhan

తోబుట్టువుల అనుబంధానికి, ఆప్యాయతలకు కొలమానాలు ఉండవు. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి.. అనే అనుబంధాలతో చిరు ప్రాయం నుంచీ పెనవేసుకున్న బంధం జీవితాంతం ఉంటుంది. అల్లరి చేసి అమ్మను విసిగించడం, నాన్నకు అమ్మ మీద చాడీలు చెప్పడం, కలిసి బడికి వెళ్లడం, ఆటలు, పండుగలు, సరదాలతో తెలీకుండానే జీవితంలో ఎదిగిపోతారు. సినిమాల్లో కూడా ఈ తరహా సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు కలబోసుకున్న కథలెన్నో తెరకెక్కాయి. అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల బంధాన్ని తెలుగు సినిమాల్లో మన రచయితలు, దర్శకులు ఎంతో అందంగా చూపించారు.

నేడు రక్షా బంధన్ సందర్భంగా తెలుగు సినీ నటులు తమ తోబుట్టువులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి  "నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి  రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు." అంటూ  మంచు విష్ణు అక్క లక్ష్మీ ప్రసన్నతో ఉన్న అనుబంధాన్ని చిన్నప్పటి ఫొటోతో గుర్తు చేసుకున్నాడు. ‘చిన్నప్పుడు భయపెట్టింది.. ఇప్పటికీ భయపెడుతూనే ఉంది..’ అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చాడు.

ఘట్టమనేని మంజుల అన్న రమేశ్ బాబు, తమ్ముడు మహేశ్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘అనుబంధాలు, ఆప్యాయతలు, అల్లరి చేస్తూ మధ్య పెరిగాం..’ అంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రేమ, అనురాగాన్ని పంచుకోండి అంటూ గౌతమ్, సితార పిక్ ను మహేశ్ పోస్ట్ చేశారు.

హ్యీపీ రక్షా బంధన్ అంటూ రామ్, నాని  తన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు. దర్శకుడు గుణశేఖర్ తాను తెరకెక్కించిన అర్జున్ మూవీ నుంచి మహేశ్ – కీర్తిరెడ్డి స్టిల్స్ పోస్ట్ చేసి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ సంస్థ యాశ్ రాజ్ ఫిలింస్ తన సినిమాల్లోని సన్నివేశాలను కలిపి వీడియో రూపంలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ దానయ్య, దిల్ రాజు.. కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో రక్షా బంధన్ శుభాకాంక్షలతో ట్విట్టర్ సందడిగా మారింది.