Karnataka CM BS Yediyurappa tests positive for coronavirus admitted to Manipal Hospital

దేశంలో సామాన్యుల‌నే కాక ప్ర‌ముఖుల‌నూ వెంటాడుతున్న క‌రోనా మ‌హ మ్మారి తాజాగా మ‌రో ప్ర‌ముఖునిపై పంజా విసిరింది. క‌ర్ణాట‌క రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి బిఎస్ య‌డ్యూర‌ప్ప కు  క‌రోనా సోకింది. ఈవిష‌యాన్ని ఆయ‌నే ఆదివారం ఉద‌యం ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.  ఆదివారం బాగా పొద్దుపోయాక త‌న‌కు క‌రోనా పాజిటివ్ ప‌రీక్షలు జ‌రిగాయ‌ని, య‌డ్యూర‌ప్ప (77) తెలిపారు. పాజిటివ్‌గా తేల‌డంతో వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో జేరాన‌న్నారు. అయితే తాను బాగానే ఉన్నాన‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. త‌న‌తో ఇటీవ‌ల కొంత కాలంగా స‌న్నిహితంగా ఉన్న వారు సైతం ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ల‌క్ష‌ణాలు ఉంటే సెల్ఫ్ ఐసొలేట్‌గా ఉండాల‌ని ఆయ‌న‌ సూచించారు.  య‌డ్యూర‌ప్ప పాజిటివ్ గా నిర్ధార‌ణ కావ‌డంతో కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న కుమార్తె ప‌ద్మావ‌తి కూడా పాజిటివ్‌గా తేలింది. ఆయ‌న కుమారుడు విజ‌యేంద్ర‌కు మాత్రం నెగిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సిఎం య‌డ్యూర‌ప్ప మ‌ణిపాల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గ‌త నెల‌లో య‌డ్యూర‌ప్ప హోమ్ ఆఫీస్‌లో ప‌నిచేసే సిబ్బందిలో ఒక‌రైన కృష్ణ అనే వ్య‌క్తికి కూడా పాజిటివ్ గా నిర్ధారించారు. అప్ప‌టి నుంచి తాను కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తిస్తాన‌ని య‌డ్యూర‌ప్ప ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే దేశంలో అధికారిక ప‌ద‌వుల్లో ఉన్న విఐపిలలో హోమ్ మినిస్ట‌ర్ అమిత్‌షా త‌ర్వాత మ‌రో పెద్ద ప‌ద‌వి క‌లిగి పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన రెండో వ్య‌క్తి వ్య‌క్తి క‌ర్ణాట‌క సిఎం కావ‌డం ప్ర‌స్తావ‌నార్హం.