Nimmagadda Ramesh Kumar Take Charge As AP SEC

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధాన అధికారిగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ సోమ‌వారం ఉద‌యం 11గంట‌ల ప్రాంతంలో తిరిగి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైకోర్టు ఆదేశాల‌తో ఇటీవ‌లే నిమ్మ‌గ‌డ్డ‌ను ప్ర‌భుత్వం తిరిగి న‌య‌మించిన సంగ‌తి తెలిసిందే. ఎన్ఇసిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన  సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల క‌మిష‌న్ స్వతంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన రాజ్యాంగ సంస్థ అని పేర్కొన్నారు. అది రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. గ‌తంలో లాగే రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ల‌భిస్తుంద‌ని భావిస్తున్నాన‌ని తెలిపారు. గ‌త శుక్ర‌వార‌మే హైద‌రాబాద్ క్యాంప్ ఆఫీసులో తాను బాధ్య‌త‌లు స్వీక‌రించాన‌ని, స్వీక‌రించిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్‌కు తెలియ‌జేయ‌డం కూడా జ‌రిగింద‌న్నారు.