corona positive for indian student in usa

అమెరికా లో కరోనా వైరస్ చాప కింద నీరులాగా వ్యాప్తి చెందింది అన్న సంగతి రోజు నమోదు అయ్యే కరోనా వైరస్ కేసులు మ మరియు మరణాల సంఖ్యని గమనిస్తే తెలుస్తుంది అయితే అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాత్రం రాష్ట్రాలని మరియు విద్యా సంస్థలని పునఃప్రారంభించాలి అని ఆదేశాలు ఇవ్వడం తో కొన్ని విద్యా సంస్థలు ఇన్-క్లాస్ బోధనను ప్రారంభించాయి. ఇండియానా లోని గ్రీన్ఫిల్డ్ సెంట్రల్ జూనియర్ హై స్కూల్ విద్యా సంస్థ గురువారం 30 జూలై నుంచి ఇన్-క్లాస్ బోధనను ప్రారంభించగా మొదలు అయిన మొదటి రోజు ఏ ఒక భారత విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది అని విద్యా సంస్థ అధికారులు తెలిపినట్టు తెలిసింది.

విద్యా సంస్థ మొదలు అయిన కొన్ని గెంటలకే హాంకక్ కౌంటీ ఆరోగ్య విభాగం ఒక భారత విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధార అయినట్లు ఫోన్ కాల్ ద్వారా స్కూల్ అధికారులకు తెలిపిన వెంటనే విద్యా సంస్థ నిర్వాహకులు అత్యవసర ప్రోటోకాల్‌ను ప్రారంభించి వైరస్ సోకిన విద్యార్థిని వేరుచేసి, తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని 14 రోజుల పాటు ఇంటి నిర్బంధం(house quarantine) లో ఉండవలసిందిగా ఆదేశించారు , మరెవరినైనా విద్యార్థి కి సోకిందా అనే దానిపై స్పష్టత రావలసి ఉంది.అయితే కరోనా వైరస్ కేస్ నమోదు అయినంత మాత్రాన విద్యా సంస్థ మూసి వేయవలిసిన అవసరం లేదు అయినా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతాయి అని ఊహించి స్కూల్ పునః ప్రారంభించడం జరిగింది అని హెరాల్డ్ ఇ. ఓలిన్, సూపరింటెండెంట్ అఫ్ ది గ్రీన్ఫిల్డ్-సెంట్రల్ కమ్యూనిటీ స్కూల్ కార్పొరేషన్ తెలిపినట్టు తెలిసింది.