taranjit-singh-sandhu-indian-ambassador-to-washington-discussed-trade-investment-opportunities-with-wisconsin-governor

అమెరికా లోని భారతీయ రాయబారి తరంజిత్ సింగ్ సంధు మరియు విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ జూలై 29 వర్చువల్ గా సమావేశమై భారతదేశం మరియు విస్కాన్సిన్ మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడుల సంబంధాల చర్చల్లో భాగంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదక రంగాలలో భారతదేశం మరియు విస్కాన్సిన్ కు ఉన్న సామర్థ్యాన్ని మరియు అభివృద్ధి వ్యూహాలను ఇద్దరూ చర్చించుకున్నారు అని ఇండియన్ ఎంబసీ పత్రికా ప్రకటనలో తెలిపినట్టు ఇండియా వెస్ట్ తెలిపింది.

భారత రాయబారి ఆరోగ్య సంరక్షణ మరియు విద్యావిధానాల ఆధునికత కోసం భారతదేశం చేపట్టిన కార్యక్రమాలను వివరించగా గవర్నర్ టోనీ భారతీయ వ్యాపార సంస్థలు విస్కాన్సిన్‌లో 185 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి, రాష్ట్రంలో 2,460 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించాయి. వారు తమ CSR కార్యక్రమాల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం చేయడానికి తోడ్పడుతునాయి అని తెలిపారు . అదేవిధంగా, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆర్థిక సేవలు మరియు సాంకేతిక రంగాలలో విస్కాన్సిన్ ఆధారిత సంస్థలు భారతదేశంలో బలమైన ఉనికిని ఏర్పరచుకున్నాయి. వాటిలో హార్లే డేవిడ్సన్, రాక్‌వెల్ ఆటోమేషన్ ఇంక్., మ్యాన్‌పవర్ గ్రూప్ మొదలైనవి ఉన్నాయి భారతదేశం మరియు విస్కాన్సిన్ బలమైన వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలు ఉండటంతో భారతదేశం మరియు విస్కాన్సిన్ మధ్య 1 బిలియన్ డాలర్లు వాణిజ్యం జరిగినట్టు ప్రకటించారు. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాము అనితెలిపినట్టు తెలిసింది.