Annual Sturgis Motorcycle Rally expecting 250 000  stirring virus concerns

కరోనా వైరస్ అమెరికాని వణికిస్తుండటంతో MLB, NFL క్రీడాకారులు ఈ సీజన్ ఉపసంహరణను ప్రకటించగా సౌత్ డకోటా మాత్రం శుక్రవారం 7th ఆగస్టు న ప్రారంభం కానున్న 80 వ ఎడిషన్ స్టుర్గిస్ మోటార్ సైకిల్ ర్యాలీ కి ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ ర్యాలీ లో సుమారుగా 250,000 కి పైగా బైకర్లు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా లో కరోనా వైరస్ విస్తారంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో పది రోజుల పాటు జరిగే ఈ ర్యాలీ అమెరికా వ్యాప్తంగా అతిపెద్ద సమావేశం కావడం తో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున స్థానికులు ఈ ర్యాలీ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అని తెలిసింది.