Ram Mandir Bhumi Pujan broadcast online

ప్రపంచంలోని హిందువులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భక్తులకు దక్కటం లేదు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతుండటంతో పాటు అయోధ్యలో కరోనా కేసుల కలకలంతో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమిపూజ జరిగే ఈ నెల 5వ తేదీన (బుధవారం) అయోధ్యలో ప్రజలెవరకూ గుమికూడరాదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍ కోరారు. భూమిపూజ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందున అందరూ టీవీల్లోనే చూడాలని విజ్ఞప్తి చేశారు.