Samsung Electronics to halt production at its last computer factory in China

టెక్‍ దిగ్గజం శాంసంగ్‍ ఎలక్ట్రానిక్స్ చైనాకు భారీ షాక్‍ ఇచ్చింది. సుజోవోలోని తన ఆఖరి ఫ్యాక్టరీ నుంచి కూడా కంప్యూటర్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్న 1700 మంది కార్మికుల్లో సగం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే, ఫ్యాక్టరీలో ఉత్పత్తిని మాత్రమే నిలిపివేస్తున్నామని, కొత్త పరికరాల పరిశోధన, అభివృద్ధి కొనసాగుతుందని సంస్థ తెలిపింది. చైనా మాకు ఎప్పటికీ ముఖ్యమైన భాగస్వామి. ఆ దేశ ప్రజలకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం అని శాంసంగ్‍ పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ఇటీవల చైనాలో కార్మికుల వేతనాల స్థాయి పెరిగింది. దీనితో పలు కంపెనీలు ఆ దేశంలో వస్తువుల ఉత్పత్తిని కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. అందులో భాగంగానే శాంసంగ్‍ కూడా చైనాలో తమ ఫ్యాక్టరీలను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలోని తమ చిట్టచివరి స్మార్ట్ ఫోన్‍ తయారీ ఫ్యాక్టరీని కూడా శాంసంగ్‍ గత ఏడాది మూసివేసింది.