coronavirus cases increase in india

భారతదేశంలో కరోనా వైరస్‍ ఉదృతి కొనసాగుతోంది. పాజిటివ్‍ కేసుల నమోదులో కొత్త రికార్డు నమోదైంది. ఒక్క రోజులో 57,118 మందికి వైరస్‍ సోకినట్లు నిర్ధారణయ్యింది. దీంతో మొత్తం కేసుల 17 లక్షలకు  చేరువయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో 764 మంది చనిపోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 36,511 చేరింది. ఈ వ్యాధి నుంచి 10.96 లక్షల మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్క రోజే 5,25,689 పరీక్షలు నిర్వహించారు.