amar-singh-dies-at-64-heres-a-look-at-some-of-the-controversies-of-ex-samajwadi-party-leader-and-rajya-sabha-mp

రాజకీయాల్లో సెలబ్రిటీగా (ప్రముఖవ్యక్తిగా) సెలబ్రిటీల్లో రాజకీయనేతగా రాణించిన అమర్‍సింగ్‍ సింగపూర్‍లో మరణించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత మార్చి నుంచి సింగపూర్‍లో ఒక దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బాలగంగాధర్‍ తిలక్‍ 100వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం ట్వీట్‍ చేసిన ఆయన ఆరోగ్యం మధాహ్నం క్షీణించటంతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. 64 ఏండ్ల వయసున్ను అమర్‍సింగ్‍ రాజ్యసభ సభ్యుడు, సమాజ్‍వాదీ పార్టీ (ఎస్సీ) మాజీ నేత. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.