coronavirus cases in july from usa

ప్రపంచవ్యాప్తం గా కరోనా వైరస్ అలజడి సృష్టిస్తూ అమెరికాలో మాత్రం విలయతాండవం చేస్తుంది. న్యూ యార్క్ టైమ్స్ డేటా బేస్ ప్రకారం జూలై నెలలో 1.9 మిలియన్లకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు అమెరికా లో నమోదు అయ్యాయి, కరోనా వైరస్ వ్యాప్తి చెందటం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా వ్యాప్తంగా నివేదించబడిన 4.5 మిలియన్లకు పైగా కేసులలో దాదాపు 42 శాతం జూలై నెలలో నమోదు అయ్యాయి అని న్యూ యార్క్ టైమ్స్ ప్రకటించింది. జులై నెల కంటే ముందు ఏప్రిల్ నెలలో 880000 కొత్త వైరస్ కేసులు తో రికార్డు నమోదు అవ్వగా జూలై నెలలో 1.9 మిలియన్లకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవ్వడం తో అమెరికా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. మిస్సిస్సిప్పి నుండి కాలిఫోర్నియా వయ్యా ఫ్లోరిడా వరకు ఉన్న రాష్ట్రాలు అధికంగా కరోనా వైరస్ బారిన పడ్డాయి అని అమెరికా వ్యాప్తంగా గత రెండు వారాలుగా సగటున 65000 కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి మరియు జులై నెల ప్రారంభం లో సగటున రోజుకు 500 మంది అమెరికా ప్రజలు కరోనా వైరస్ బారిన పడి మరణిస్తుండగా జూలై నెల చివరికి వచ్చేసరికి రోజువారీ కరోనా వైరస్ మరణాల సగటు 1000 కు చేరింది అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

అనేక రాష్ట్రాల్లో, బాధిత ప్రభుత్వ అధికారులు నివాసితుల పై మరియు వ్యాపారాల సంస్థలపై ఆంక్షలను కఠినతరం చేస్తూ ప్రజలకు కరోనా వైరస్ సంబంధిత ఆసుపత్రిలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల గురించి హెచ్చరిస్తున్న అప్పటికీ ప్రపంచంలో ఏ ప్రదేశాలలోనూ సంక్రమించనంతగా కరోనా వైరస్ అమెరికాలో సంక్రమిస్తున్నది అని న్యూ యార్క్ టైమ్స్ పేరుకుంది.