fauci-raises-concern-over-russian-chinese-vaccines

కరోనా వైరస్‍ను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లను తాము వినియోగించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‍ సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు ఆంటొనీ ఫౌచి ప్రకటించారు. ఆ దేశాల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యాక్సిన్‍ సరఫరా చేసే ముందు అన్ని పరీక్షలు నిర్వహించాలి. మా ప్రమాణాలకు సరితూగని ఏ వ్యాక్సిన్‍నూ మేము వాడబోము అని ఆయన అన్నారు.