Apple removes 29800 apps from China store

చైనీస్‍ యాప్‍ స్టోర్‍ నుంచి అకస్మాత్తుగా 29,800 యాప్‍లను స్మార్ట్ఫోన్‍ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‍ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్‍ యాప్‍లే కావడం గమనార్హం. లైసెన్స్ లేని గేమ్‍ యాప్‍లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్‍ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ ఆంటోంది. చైనా ఆండ్రాయిడ్‍ యాప్‍ స్టోర్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూలై మొదటి వారంలో యాపిల్‍ తన యాప్‍ స్టోర్‍ నుంచి 2,500 టైటిళ్లను తొలగించింది. ఇందులో ప్రజాదరణ ఉన్న జింగా, సూపర్‍సెల్‍ వంటివి కూడా ఉన్నట్లు సమాచారం.