Indian origin Dancer Bags Award from UK PM for Free Bhangra fitness Lessons During Quarantine

బ్రిటన్‍లోని భారత సంతతి వ్యక్తి, డ్యాన్సర్‍ రాజీవ్‍ గుప్తాకు ఆ దేశ ప్రధాని బోరిస్‍ జాన్సన్‍ అవార్డును అందజేశారు. లాక్‍డౌన్‍ కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి రాజీవ్‍ గుప్తా ఆన్‍లైన్‍లో ఉచితంగా బాంగ్రా డ్యాన్స్ తరగతులను చెప్పారు. దీంతో ప్రజలు ఫిట్‍నెస్‍గా ఉండటంతో పాటు వినోదాన్ని ఆస్వాదించారు. ఆయన కృషిని గుర్తించిన ప్రధాని బోరిస్‍ జాన్సన్‍ పాయింట్‍ ఆఫ్‍ లైట్‍ పురస్కారంతో సత్కరించారు.