Andhra Pradesh government to sign MoU with Indian School of Business

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు, పలు ప్రభుత్వ విభాగాల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా మరింత పారదర్శక పాలన కల్పించడానికి ఇండియన్‍ స్కూల్‍ ఆఫ్‍ బిజినెస్‍ (ఐఎస్‍బీ) ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఆగస్టు  5న ఐఎస్‍బీ, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍ రెడ్డి ప్రకటించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంస్థ ప్రతినిధులతో మంత్రి ఎంవోయూపై చర్చించారు. ఐ.టీ. పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యలకైనా ఐఎస్‍బీ పరిష్కారం చూపుతుందన్నారు.