Anushka reject big offer

నాలుగు నెలలుగా థియేట‌ర్స్ మూత‌ప‌డి ఉండ‌డంతో జ‌నానికి టీవీలే దిక్క‌య్యాయి. ఇప్పుడు ఓటీటీ సంస్థ‌లు కూడా సినిమాలు ఎక్కువ‌గా కొనుగోలు చేయ‌డం, సినిమాల‌ను మించే స్థాయిలో వెబ్ సిరీస్‌లు నిర్మించ‌డ‌డం వంటివి జ‌నం థియేట‌ర్స్ మ‌ర్చిపోయేలా చేస్తున్నాయి. త‌మ సినిమా థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేస్తామ‌ని, ఓటీటీకి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని భీష్మించుకొని కూర్చున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఇప్ప‌ట్లో వారి సినిమా థియేట‌ర్‌లో చూసుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ థియేట‌ర్స్ ఓపెన్ చేసిన త‌ర్వాత రిలీజ్ చేసినా ప్ర‌భుత్వం విధించే ష‌ర‌తుల‌ను అనుస‌రించి ఎక్కువ టిక్కెట్లు తెగే అవ‌కాశం లేదు. వీట‌న్నింటి కంటే ముఖ్య‌మైంది అస‌లు జ‌నం థియేట‌ర్‌కి జ‌నం వ‌స్తారా? ఈ ప్ర‌శ్నే అంద‌రిలోనూ మెదులుతోంది.

ఈ క్ర‌మంలోనే అనుష్క న‌టించిన `నిశ్శ‌బ్దం` చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ అయ్యేలా చూడాల‌ని చాలా ఓటీటీ సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ, దానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఓ ఓటీటీ సంస్థ మ‌రో ప్లాన్ వేసింది. త‌మ సంస్థ ఓ భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంద‌ని అందులో న‌టిస్తే భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ముట్ట‌జెపుతామ‌ని అనుష్క‌ను సంప్ర‌దించారు. అయితే అనుష్క ఆ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించింది. త‌నకు వెబ్‌సిరీస్‌లో న‌టించే ఉద్దేశం ప్ర‌స్తుతానికి లేద‌ని స్ప‌ష్టం చేసింది. సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డిన త‌ర్వాత త‌ను చేయ‌బోయే సినిమా మీద దృష్టి పెట్టింది. క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతోంది. దీనికి గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.