Dulquer Salmaan to play Lieutenant Ram in Hanu Raghavapudi s period film

గతం లో ఒక హీరో వదులుకున్న సినిమాను మరో హీరో చేయడం అది సూపర్ డూపర్ హిట్ కావడం ఆ తరువాత మొదటగా కథ విన్న హీరో పడటం జరిగాయి. ఒక వేళ కథ నచ్చకనో.. నచ్చినా డేట్స్ కుదరకనో.. కుదిరినా టైం కలిసి రాకనో సినిమాలు మిస్ అవుతుంటారు కొందరు. లేటెస్ట్ గా నాని చేయాలనుకున్న ఓ సినిమా సడెన్ గా వేరే హీరో చేతుల్లోకి వెళ్ళింది. నానితో ఆల్రెడీ ఓ మంచి హిట్ తీసిన డైరక్టర్ రెండో మరోసారి నానితో సినిమా చేయాలని ఓ అద్భుతమైన కథతో వచ్చాడట కాని నాని మాత్రం ఈసారి అతనికి ఛాన్స్ ఇవ్వలేదు.

కట్ చేస్తే.... నాని వద్దనుకున్న కథను మహానటి ఫేమ్ మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ ను ఈ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ఆ డైరక్టర్ హను రాఘవపుడి. ఇటీవల దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చిన సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది. 1964 ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా యుద్ధంతో రాసిన ప్రేమకథగా తెరకెక్కనుంది. ఈ సినిమా కథను ముందు నానికి చెప్పగా నాని కూడా అప్పుడు ఇంట్రెస్ట్ చూపించాడట. నానితో అప్పటికే కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా చేసిన హను రాఘవపుడి, ఆ తర్వాత లై, పడి పడి లేచే మనసు, సినిమాలైతే చేసాడు కాని అందుకు తగినట్టుగా ఫలితాలు దక్కించుకోలేదు. నితిన్ తో లై, తరువాత హను రాఘవపుడి చివరగా శర్వానంద్ తో తీసిన పడి పడి లేచే మనసు సినిమా కూడా భారీ అంచనాలతో వచ్చినా సినిమా ఆకట్టుకోలేదు.

ఇక దుల్కర్ సల్మాన్ తో నాని ఈసారి హిట్టు టార్గెట్ పెట్టుకున్నాడు. పిరియాడికల్ మూవీ కాబట్టి తప్పకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టనెంట్ రామ్ పాత్రలో కనిపిస్తున్నాడు. సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్న దత్ లు నిర్మిస్తున్నారు. ఒకవేళ సినిమా రిలీజై సూపర్ హిట్టైతే నాని ఓ మంచి సినిమా మిస్ చేసుకున్నట్టే. ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.