Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.50 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్‍ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‍ ఆసుపత్రుల్లో 72,188 మంది చికిత్స పొందుతుండగా, 76,614 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు బులిటెన్‍లో ప్రభుత్వం తెలిపింది. ఇవాళ అత్యధికంగా 12,750 మంది కొవిడ్‍ నుంచి కోలుకుని డిశ్చార్జి కావడం విశేషం.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,12,573 నమూనాలను ప్రభుత్వం పరీక్షించింది. తూర్పుగోదావరిలో 8 మంది, విశాఖపట్నంలో 8, గూంటురులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గరు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒకరు కరోనాతో మృతి చెందారు.