Joe Biden To Campaign In Telugu For Presidential Elections

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో (నవంబర్ 3, 95 రోజులు) డెమొక్రాట్స్ మరియు రిపబ్లికన్లు ఓటర్లను ఆకర్షించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగం గానే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారతీయ-అమెరికన్ ప్రజలు ముఖ్య పాత్రా పోషించనుండటంతో అమెరికా అధ్యక్ష అభ్యర్థి, అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కన్నా ఆధిక్యం లో ఉన్న మిస్టర్ బిడెన్ తన ప్రచారం 14 భారతీయ రాష్ట్ర భాషలలో జరగనునటు మరియు భారతీయ-అమెరికన్ ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడటానికి 14 భాష ప్రచార కార్యక్రమ విధానాన్ని ఉపయోగించనున్నారు అని అజయ్ భూటోరియా, బిడెన్ జాతీయ ఆర్థిక కమిటీ సభ్యులు తెలిపారు ( హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మలయాళీ, ఒరియా, మరాఠీ మరియు నేపాలీ).

భారతీయ-అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి మిస్టర్ బిడెన్ “అమెరికా క నేత కైసే హో, జో బిడెన్ జైసా హో”  (అమెరికా అధ్యక్షుడు ఎలా ఉండాలి జో బిడెన్ లాగా ఉండాలి) నినాదం తో ప్రచారం చేస్తున్నారు.

2014 లో భారత ప్రధాని మోదీ మొదలుపెట్టిన “అబ్ కి బార్ మోడీ సర్కార్" నినాదం తో భారతీయ ఓటర్లను ప్రభావితం చైయగ ఇదే తరహా లో అమెరికా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ 2016 లో భారతీయ-అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి "అబ్ కి ట్రంప్ సర్కార్" నినాదం తో ప్రచారం చేశారు.