American people overwhelmingly backs India over China Survey

భారత్‍-చైనా మధ్య సైనిక, ఆర్థికపరమైన అంశాల్లో వివాదాలు తలెత్తిన పక్షంలో ఏదో ఒక దేశానికి మద్దతు తెలుపవలసి వస్తే భారత్‍కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మేధోసంస్థ లోవీ ఇన్‍స్టిట్యూట్‍ 1,012 మంది అమెరికా పౌరులపై జూలై 7న నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత్‍, చైనా మధ్య సైనిక వివాదం తలెత్తితే భారత్‍కే అమెరికా అండగా నిలువాలని 32.6 శాతం మంది కోరుకున్నారు. 3.8 శాతం మంది మాత్రమే చైనాకు మద్దతుగా నిలిచారు. ఆర్థికపరమైన వివాదంలో 36.3 శాతం మంది భారత్‍కు, 3.1 శాతం మంది చైనాకు అగ్రరాజ్యం మద్దతునివ్వాలని ఓటేశారని సర్వే వెల్లడించింది. మరోవైపు, సైనిక వివాదం తలెత్తితే ఇరు దేశాలకు అమెరికా మద్దతు ప్రకటించవద్దని 63.6 శాతం మంది కోరుకున్నారు. ఆర్థిక వివాదం విషయంలో 60.6 శాతం మంది ఎవరికీ అమెరికా మద్దతును ఇవ్వకూడదని చెప్పారని సర్వే పేర్కొంది.