TANA Sevalu in Covid 19 Period

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోవిడ్‍ 19 సేవలపై తెలుగు టైమ్స్ ప్రత్యేక సావనీర్‍ను ప్రచురించింది. ఈ ప్రత్యేక సావనీర్‍ను తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి ఆగస్టు 1వ తేదీ శనివారంనాడు భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్‍ మాజీ సభ్యుడు మురళీమోహన్‍ ఈ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్‍ హానర్‍గా పాల్గొననున్నారు. తానా నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలుగు టైమ్స్ ఎడిటర్‍ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు.