Chinese scientist arrested in SF after seeking medical care

వీసా అవకతవకల ఆరోపణలకు సంబంధించి చైనాకు చెందిన మహిళా శాస్త్రవేత్తని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్‍ ఆర్మీతో సంబంధం ఉన్న జువాన్‍ తాంగ్‍ అనే మహిళని శాన్‍ఫ్రాన్సిస్కో  చైనా కాన్సులేట్‍ కార్యాలయం నుంచి బయటకి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా మిలటరీతో తనకు ఉన్న సంబంధాలను దాచి పెట్టి, వీసాలో అవకతవకలకు పాల్పడ్డారని జువాన్‍ తాంగ్‍పై అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్‍ 27న కాలిఫోర్నియా యూనివర్సిటీలో పనిచేయడానికి ఆమె అమెరికాకి వచ్చారు. అయితే తప్పుడు వీసాతో ఆమె అమెరికాకు వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.