US Ambassador Kelly Craft press meet

సెప్టెంబర్‍ 22న జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ హాజరయ్యే అవకాశం ఉందని ఐరాసలో అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్ చెప్పారు. సాధారణంగా ఏటా జరిగే ఐరాస సర్వసభ్య సమావేశానికి 193 దేశాల అధికారులు గానీ, విదేశాంగ మంత్రులు గానీ హాజరవుతుంటారు. కానీ, ఈ ఏడాది కోవిడ్‍ కారణంగా ఈ కార్యక్రమాన్ని 75 ఏళ్ల ఐరాస చరిత్రలో మొదటిసారిగా వర్చువల్‍గా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్లో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు తమ సందేశాలను వీడియో రూపంలో ముందే చిత్రీకరించి ఐరాసకు అందించనుండగా స్వయంగా హాజరై ప్రసంగించే నేత ట్రంప్‍ ఒక్కరేనని కెల్లీ తెలిపారు.