Plasma donors in Andhra Pradesh to get Rs 5000 each

కరోనా చికిత్స కోసం ప్లాస్మా ఇచ్చే దాతలకు రూ.5వేల ఆర్థిక సాయం అందించాలని ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ ఆదేశించారు. ఈ సాయం వారికి మంచి భోజనం, వైద్య అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్లాస్మాథెరపీతో సానుకూల ఫలితాలు వస్తుంటే దాన్ని బాగా ప్రోత్సహించాలని, అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వైఎస్సార్‍ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ఆసుపత్రుల్లో నాడు నేడు పురోగతిపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించి మాట్లాడారు. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, విద్యార్థులకు విద్యాకానుకతోపాటు మాస్కూలు ఇవ్వాలని చెప్పారు.