RGV s next movie to be titled RGV Missing

తప్పిపో లేదులెండి తనమీదే ఓ కొత్త సబ్జెక్టు రెడీ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇకపై కొన్నాళ్ల పాటు సినిమా జనాలను టార్గెట్ చేయకూడదని వర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అల్లు అరవింద్ పై తీద్దాం అనుకున్న సినిమాను కూడా తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు బోగట్టా.  కొన్నాళ్ల పాటు థ్రిల్లర్లు, అడల్ట్ కంటెంట్ సినిమాలు మాత్రమే విడుదల చేస్తారు. దానితో పాటు ఆర్జీవీ మిస్సింగ్ అనే పేరుతో ఆయనే నటిస్తూ ఒక థ్రిల్లర్ ను తీసే ఆలోచన చేస్తున్నట్లు బోగట్టా. ఈ మేరకు ఈరోజో రేపో ఆర్జీవీ ప్రకటన ఇస్తారని తెలుస్తోంది.  

రకరకాల సంచలనాత్మక సినిమాలు ప్లాన్ చేస్తూ, కొన్ని విడుదల చేస్తూ, కొన్ని షూట్ చేస్తూ, మరికొన్ని ప్రకటిస్తూ వస్తున్న దర్శకుడు ఆర్జీవీ లేటెస్ట్ అనౌన్స్ మెంట్ ఇదే అని తెలుస్తోంది.  ఈ సినిమా ఇటీవలి ఆర్జీవీ సినిమాల మాదిరిగా చిన్న సినిమాగా వుండదు. సుమారు గంటకు పైగా వుండే థ్రిల్లర్ గా వుండబోతోంది.  వారానికి ఓ సినిమా వంతున విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు వర్మ. అందుకే చకచకా కాన్సెప్ట్ లు అల్లుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ ఆర్జీవీ మిస్సింగ్..