Olivia de Havilland Golden Age of Hollywood star dies at 104

హాలీవుడ్ స్వర్ణ యుగ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న నటి ఒలివియా డి హవిలాండ్ ఫ్రెంచ్ రాజధాని పారిస్ లోని తన ఇంటిలో సహజ మరణాన్ని పొందారు. ఆమె వయసు 104 సంవత్సరాలు అని ఆమె ప్రచారకర్త చెప్పారు. డి హవిలాండ్ 50 సంవత్సరాల చలనచిత్ర జీవితం లో ఆమె దాదాపు 50 చలన చిత్రాలలో నటించారు మరియు 1939 క్లాసిక్ “Gone with the Wind” చిత్ర నటి నటులలో చివరి నక్షత్రం గా ఆమెను పిలుస్తారు. “To Each His Own” చిత్రంలో ఆమె నటనకి 1946 లోఉత్తమ నటి గా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు తిరిగి 1949 లో “The Heiress” చిత్రంలో ఆమె నటనకి రెండోసారి ఉత్తమ నటి గా ఆస్కార్ అవార్డును ఆమె అందుకున్నారు.

1940’s నటీ నటుల పారితోషికం మరియు వారి సినీ జీవితం పై పూర్తి అధికారం సినిమా స్టూడియోస్ అధినేతల చేతుల్లో ఉన్న సమయంలో వార్నర్ బ్రదర్స్ ఆమె పై వేసిన పెనాల్టీ కి ఒలివియా కోర్ట్ ని ఆశ్రయించి , నటి నటుల కాంట్రాక్ట్స్ ని రద్దు చైయించటం తో ఈ చట్టాని డే హవిల్లాండ్ లా అని పిలుస్తారు.