అమెరికాలో మళ్లీ లాక్‍డౌన్‍ !

lockdown once again in us

అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణతో కాలిఫోర్నియాలో బార్లు, ఇండోర్‍ డైనింగ్‍ రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, జిమ్‍లు మూతపడనున్నాయి. హెయిర్‍, నెయిల్‍ సెలూన్లపై ఆంక్షలు విధించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 వేల మందికిపైనే ప్రాణలు కోల్పోయారు. అమెరికాలో సోమవారం 60వేలకుపైనే కేసులు నమోదయ్యాయి. 27 రాష్ట్రాలు సడలించిన లాక్‍డౌన్‍ నిబంధనలను తిరిగి కఠినతరం చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో క్వారంటైన్‍ నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. బ్రిటన్‍లో షాపింగ్‍లో మాస్కులు ధరించకపోతే 100 పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. దక్షిణాఫ్రికా 2,87,796 బాధితులతో వైరస్‍ ప్రభావిత దేశాల్లో టాప్‍ 10కు చేరుకుంది. పాకిస్థాన్‍లో కేసులు సంఖ్య 2,53,604కి చేరింది. సింగపూర్‍లో 347 లక్షలకు చేరువైంది. రష్యాలో కొత్తగా 6,248 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయింది.

 


                    Advertise with us !!!