us-open-to-be-held-as-scheduled-but-usta-cancels-other-events

కరోనా వైరస్‍ కారణంగా తమ పరిధిలో ఆగస్టులో జరగాల్సిన అనేక టోర్నీలను అమెరికా టెన్నిస్‍ సంఘం (యుఎస్‍టీఏ) రద్దు చేసింది. వివిధ జూనియర్‍ వయో విభాగాల్లో యుఎస్‍టీఏ నేషనల్‍ ఛాంపియన్‍ షిప్స్ను నిర్వహించరాదని నిర్ణయించింది. యుఎస్‍ ఓపెన్‍ను మాత్రం ఇప్పటికే నిర్వహించాలనే ఆలోచనతోనే ఉంది. షెడ్యూల్‍ ప్రకారం యుఎస్‍ ఓపెన్‍ ఆగస్టు 31న ఆరంభం కావాల్సివుంది. కరోనా వల్ల వింబుల్డన్‍ రద్దు కాగా.. ఫ్రెంచ్‍ ఓపెన్‍ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.