Google Facebook Microsoft other tech companies join lawsuit against new student visa rule

జూలై 6 న అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ ద్వారా కోర్సెస్ అభ్యసించే వాళ్లకి వీసా రద్దుచేస్తునట్టు ప్రకటించినప్పటి నుంచి అమెరికా లోని వేలాది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అయోమయం గా మారాయి.

గూగుల్, ఫేస్‌బుక్ మరియు మైక్రోసాఫ్ట్ సహా డజనుకు పైగా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు సోమవారం 13 జూలై హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) జూలై 6 ప్రకటించిన నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ కి మద్దతు తెలిపాయి. ఇది భారతీయ విద్యార్థులకు కొంత ఊరట కలిగించే విషయం.

ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) జూలై 6 ప్రకటించిన నిబంధన పై యు.ఎస్ ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు ఇతర ఐటి న్యాయవాద సమూహాలు ఈ నిబంధనని తాత్కాలికంగా ఆపాలి అని మరియు ప్రాథమిక నిషేధం ఉత్తర్వులను ఇవ్వాలిసింది గా న్యాయస్థానాన్ని కోరాయి. జూలై 6 ప్రకటన ఐటీ మరియు ఇతర సంస్థల ఉద్యోగ నియామక ప్రణాళికలకు భంగం కలిగించే విధంగా మరియు అంతర్జాతీయ విద్యార్థులను తమ భవిష్యత్ ఉద్యోగులు గా నియమించడానికి, శిక్షణ ఇవ్వడానికి కూడా భంగం కలిగించే విధంగా ఈ ప్రకటన ఉంది అని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ఉద్ఘాటించాయి.

అమెరికా లోని అంతర్జాతీయ విద్యార్ధులు వారు విద్యార్ధులుగా ఉన్నప్పుడు మరియు వారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అమెరికా వ్యాపారసంస్థల కి ముఖ్యమైన వనరులు అని టెక్ కంపెనీలు తెలిపాయి. అంతేకాకా అమెరికా లో గ్రాడ్యుయేట్ అయిన అంతర్జాతీయ విద్యార్ధులు, అమెరికా లో ఉన్న లేదా వారి స్వదేశానికి తిరిగి వెళ్లిన అమెరికా వ్యాపారసంస్థలకి విలువైన ఉద్యోగులు గా లేక విలువైన వినియోగదారులు అవుతారు అని టెక్ కంపెనీలు తెలిపాయి.

2018-2019 విద్యా సంవత్సరంలో మాత్రమే, యుఎస్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలోని అంతర్జాతీయ విద్యార్థుల కారణంగా యుఎస్ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 41 బిలియన్ డాలర్లు లాభం చేకూరింది మరియు 458,290 విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా లో నివసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా జిడిపి ప్రామాణికంగా ఉండటానికి సహాయపడుతున్నారు. జూలై 6 వెలుబడిన ప్రకటను అమ్మలు అయితే అమెరికా వ్యాపారసంస్థల కే కాదు అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లోకి వెళ్లే ప్రమాదం ఉంది అని కంపెనీలు తెలిపాయి.