alia in hospital  nawazuddin siddiqui romance at home

సినిమా ఫీల్డ్‌లో పెళ్లి చేసుకోవ‌డం, విడిపోవ‌డం, మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం అనేది స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. ఇది బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ఎక్కువ‌గా ఉండేది. ఇప్పుడు అక్క‌డ ఉంది, ఇక్క‌డ లేదు అని చెప్ప‌డానికి లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌,... ఇలా అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉంది. కొంత‌మంది విడాకులు తీసుకున్న త‌ర్వాత వారి వారి కెరీర్ గురించి త‌ప్ప జ‌రిగిన విష‌యాల గురించి ఎక్క‌డా మాట్లాడ‌రు. కానీ, కొంత‌మంది విడాకులు తీసుకున్న త‌ర్వాత కూడా భ‌ర్త మీద భార్య‌, భార్య మీద భ‌ర్త ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి జంటే న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, అలియా. వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి న‌వాజుద్దీన్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంది అలియా. ఆమె అస‌లు పేరు అంజ‌నా కిశోర్ పాండే.

తాజాగా న‌వాజుద్దీన్‌పై అలియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తాను డెలివ‌రీ టైమ్‌లో హాస్పిటల్‌లో ఉంటే అత‌ను మాత్రం ఇంట్లో అమ్మాయిల‌తో రొమాన్స్ చేసేవాడ‌ని ఆరోపించింది. నేను హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు న‌వాజ్ కుటుంబ స‌భ్యులు కూడా వ‌చ్చారు. కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల నేను ఎక్కువ రోజులు హాస్పిట‌ల్‌లో ఉండాల్సి వ‌చ్చింది. ఆ టైమ్‌లో కూడా అత‌ను హాస్పిట‌ల్‌కి రాకుండా ఇంట్లోనే ఉండిపోయేవాడు. నేను డిశ్చార్జి అయి ఇంటి వ‌చ్చిన త‌ర్వాత అత‌ని వ్య‌వ‌హారం మొత్తం తెలిసింది. అది కూడా అత‌ని త‌మ్ముడే చెప్పాడు` అంటూ చెప్పుకొచ్చింది. న‌వాజ్‌కు పెళ్లికి ముందు నుంచే అమ్మాయిల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ విష‌యంలో త‌మ‌కు త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవ‌ని, పెళ్లి త‌ర్వాత కూడా వారితో సంబంధాలు కొన‌సాగించ‌డం వ‌ల్ల తాను విడాకులు తీసుకున్నాన‌ని తెలిపింది అలియా.