Jacqualine Fernandez to romance Pawan Kalyan

ప్ర‌స్తుత క‌రోనా కాలంలో పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ ఏవీ జ‌ర‌గ‌డం లేదు. కొన్ని మ‌ధ్య‌లో ఉన్నాయి, కొన్ని చివ‌రి ద‌శ‌లో, మ‌రికొన్ని సినిమాలు అస‌లు సెట్స్‌పైకే వెళ్ల‌లేదు. పూర్తి కాని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుద‌ల కావాలంటే చాలా కాలం ప‌ట్టేలా ఉంది. అయినా పెద్ద హీరోల సినిమాల‌కు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉంది. రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. `వ‌కీల్‌సాబ్‌` పేరుతో రూపొందే ఈ సినిమాని వేణు శ్రీరాం తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. బోనీకపూర్ సహ నిర్మాతగా ఉన్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా షూటింగ్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ చేయ‌బోయే సినిమాకి సంబంధించిన అప్‌డే్ట్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. `వ‌కీల్‌సాబ్‌` పూర్తి కాగానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే సినిమా సెట్‌లోకి ఎంట‌ర్ అయిపోతాడు ప‌వ‌న్‌. శ్రీ సూర్య మూవీస్ ప‌తాకంపై ఎ.ఎం.ర‌త్నం భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. పవన్ కళ్యాణ్ కోసం మొఘలుల కాలం నాటి కథని ఎంచుకున్నాడు క్రిష్. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ జాక్వ‌లిన్ ఫెర్నాండ‌స్ న‌టించ‌నుంద‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ సినిమాలో జాక్వ‌లిన్ యువ‌రాణిగా క‌నిపిస్తుంద‌ట‌. ఆమె క్యారెక్ట‌ర్‌ను క్రిష్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి `విరూపాక్ష` అన్న టైటి్ల్‌ని చిత్ర బృందం ప‌రిశీలిస్తోంద‌ని ఆమ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. త‌మ హీరో సినిమాకి ఈ టైటిల్ చాలా అద్భుతంగా ఉంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ టైటిల్‌ను అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చెయ్యాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం మ‌రో రెండు టైటిల్స్‌ని కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. అయితే ఏ టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేస్తారో తెలియాల్సి ఉంది.