rrr song to release on vinayaka chavithi

టాలీవుడ్ లో ఆర్ ఆర్ఆర్ సినిమా గురించి  ఏ చిన్న విషయం బయటకు పొక్కినా అది సంచలనం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే ఫాన్స్ ఎంతో ఆశగా చదువుతున్నారు. మెగా నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి నటించడం తో సినిమాపై బాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత అనేది రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఏంటీ అనేది ఒకసారి తెలుసుకుంటే....ఈ సినిమాలో నటులు, కనిపించే పాత్రలు ఈ సినిమా టైటిల్ అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఒక సంచలనం. ఈ సినిమాలో కొన్ని కొన్ని గెస్ట్ పాత్రలు ఉండే అవకాశం ఉంది అని అందులో స్టార్ హీరోలను చూపించే ఆలోచనలో జక్కన్న ఉన్నారు అని అంటున్నారు. బాలీవుడ్ లో సీనియర్ హీరోలు కొందరిని ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించి అడిగారు అని టాక్. అదే విధంగా మాలీవుడ్ నుండి  కొందరు స్టార్ లను కూడా అడిగారు అని వారు కూడా అందుకు ఓకే చేసారు అనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు కరోనా దెబ్బకు భారీగా మార్కెట్ పడిపోయే అవకాశాలు ఉన్న నేపధ్యంలో దర్శకుడు రాజమౌళి నిర్మాత దానయ్య మార్కెటింగ్ కోసం సినిమాకు మరింతగా క్రెజ్ తీసుకురావడానికి  ఈ ప్లాన్ వేసారట.

ఈ సినిమాకి సంభందించిన ఒక  ప్రోమో మాత్రం రాంచరణ్ పుట్టిన రోజు వదిలారు. అదే విధంగా ఎన్టీర్ పుట్టిన రోజునాడు మరొక గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ అది అసంపూర్తి గా ఉండడం వలన వీలుపడలేదు. ఇదిలా ఉండగా వినాయక చవితి లేదా శ్రావణ శుక్రవారం రోజున ఆర్ఆర్ఆర్ లో ఒక పాటను విడుదల చేసే అవకాశం  ఉందని  అంటున్నారు. భక్తితో ఉండే పాటను శ్రావణ శుక్రవారం రోజున విడుదల చేయడానికి గానూ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. దానికి సంబంధించి ప్రస్తుతం  చర్చలు జరుగుతున్నాయట. రెండు  నిమిషాల నిడివిగల వీడియో ని విడుదల చేసే అవకాశం ఉంది అనే టాక్ వస్తుంది.  దీనిపై ఇప్పుడు చాలా వరకు కూడా చర్చలు నడుస్తున్నాయి అని అన్నీ అనుకున్న విధంగా జరిగితే వచ్చే వినాయక చవితి లేదా శ్రావణ రెండో శుక్రవారం రోజు విడుదల చేస్తారు అని అంటున్నారు.