mahesh babu guest role in ajith movie

ఈ హెడ్డింగ్ అనుకుంటున్నారా 2007 రిలీజ్ అయినా సినిమా గురించి ఇప్పుడేంటి? అదే మరి ఓ సారి చదవండి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో పండగ. దాదాపుగా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆయన సినిమాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన కూడా తన సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని భావించినా సరే అది లేట్ అయ్యే అవకాశాల్లు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పుడు మహేష్ ఒక తమిళ సినిమాలో చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అజిత్ హీరో గా వస్తున్న ఒక సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు చాలానే చర్చలు జరుగుతున్నాయి అని వచ్చే ఏడాది ఈ  సినిమా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. టాలీవుడ్ లో చాలా వరకు కూడా ఈ సినిమాలో ఎవరు ఎవరు నటిస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మహేష్ ఈ సినిమా కోసం ఒక నెల రోజులు చెన్నై లో ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు మహేష్ చేతిలో రాజమౌళి సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.