ఏపీలో పదీ పరీక్షలు రద్దు

AP SSC exams 2020 cancelled all students promoted

కరోనా విజృంభన నేపథ్యంలో ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్థులందరినీ పాస్‍ చేస్తున్నట్టు పేర్కొంది. ఎస్‍ఎస్‍సీ, ఓఎస్‍ఎస్‍సీ, ఒకేషనల్‍ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు సృష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‍ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తగరతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్‍ టికెట్లు పొందిన విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్‍ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించారు.