Another US Air Force F 16 jet crashes in New Mexico fifth crash since May

అమెరికా వైమానికి దళానికి చెందిన మరో అమెరికా విమానం మంగళవారం కూలిపోయింది. న్యూమెక్సికోలో తెల్లవారు జామున 3:50 గంటల సమయంలో యూఎస్‍ ఎయిర్‍ఫోర్స్కు చెందిన ఎఫ్‍-16 జెట్‍ కుప్పకూలింది. హోల్‍మన్‍ ఎయిర్‍ బేస్‍లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో జెట్‍ విమానం అదుపు తప్పింది. కాగా, ఫైలెట్‍ చాకచక్యంగా వ్యవహరించడంతో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 5సార్లు ఇలా అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాలు కుప్పకూలాయి. గడిచిన రెండు వారాలలో రెండు ఎఫ్‍-6  జెట్లు ప్రమాదానికి గురి కావడం గమనార్హం.