china imposes tit for tat sanctions on three american lawmakers

అమెరికా చర్యకు చైనా ప్రతిచర్య ప్రకటించింది. అమెరికా రిపబ్లికన్‍ పార్టీకి చెందిన ముగ్గురు నేతలతో పాటు ఒక రాయబారిపై చైనా వీసా ఆంక్షలు విధించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్వింగ్‍ మీడియాతో మాట్లాడుతూ మా అధికారులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది అని వ్యాఖ్యానించారు. జిన్‍జియాంగ్‍ ప్రావిన్సులోని ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అమెరికా ఇటీవల ముగ్గురు చైనా ప్రభుత్వాధికారులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.