Corona wreaks havoc in Florida, figures crossed 2 million

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఆదివారం రికార్డు స్థాయిలో 15,299 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,69,811కి చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒక్కరోజులోనే 15వేలకు పైగా నమోదవడం ఇదే తొలిసారి. అలాగే అమెరికా వ్యాప్తంగా గత 24 గంటల్లో 56వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. అమెరికా తొలినుంచీ ఆరోపిస్తున్నట్టుగానే మహమ్మారి కరోనా వైరస్‍కు మూలం చైనాలోని ఉందనే విషయాన్ని నిర్ధారించే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు నిపుణులు నిమగ్నమైయ్యారు.  ప్రస్తుతం వారు చైనాలోనే ఉన్నారు.