Vijay Sethupathi confirms opting out of Allu Arjun s Pushpa Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్నారు  అల్లు అర్జున్.. 'ఆర్య' హిట్ కాంబినేషన్ అయినా సుకుమార్ తో సినిమా చేసేందుకు మొగ్గుచూపారు.. అయితే అల్లు అర్జున్ మొదటి సారి తన కెరీర్లో మాస్ లుక్ తో కూడిన పాత్రను చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సంబంధించి విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఎంతో ఆసక్తికరంగా వుంది  ఇప్పుడు వరకు అభిమానులు ఎప్పుడూ ఊహించని విధంగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఉంది. దీంతో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. స్మగ్లింగ్ నేపథ్యంలో పిరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ హీరో వైవిధ్యమైన నటుడు అయిన విజయ్ సేతుపతి ని తీసుకున్నారు చిత్రబంధం. కానీ  షూటింగ్ ప్రారంభానికి ముందే విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అనే వార్తలు హల్ చల్ చేశాయి. భారీ రెమ్యునరేషన్ ఇవ్వకపోవటం కారణంగానే విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నారు అని టాలీవుడ్ లో టాక్ వినిపించింది.

అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ సేతుపతి పుష్ప సినిమా నుంచి తప్పుకోవడం పై క్లారిటీ ఇచ్చారు. తాను పుష్ప సినిమా చేయడం లేదని... ముందుగా ఆ సినిమాలో విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారని... తాను కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నప్పటికీ ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ గారిని వ్యక్తిగతంగా కలిసి తన కాల్షీట్స్ సమస్య ఉంది అని చెప్పి సినిమా నుంచి తప్పకున్నాను అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. నా కాల్ షీట్స్  కారణంగా చిత్రబృందాన్ని  ఇబ్బందులకు గురి చేయడం ఇష్టం లేకనే ఇలా చేయాల్సి వచ్చింది అంటూ విజయ్ సేతుపతి వివరించాడు. తెలుగు లో  విజయ్ సేతుపతి నటించిన 'ఉప్పెన' విడుదలకు సిద్ధంగా వుంది  కాకపోతే కరోనా క్రైసిస్ వలన ఆగింది.