new rules for flight passengers

విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసలుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదికి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‍ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు.. వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు. కరోనా బారినపడి కోలుకున్నవారికి ఈ వెసలుబాటు ఉంటుంది. వారు కోవిడ్‍కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు విమాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్‍ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేంది.