New York City Reaches Milestone With No Reported Virus Deaths

న్యూయార్క్లో నాలుగు నెలల్లో తొలిసారిగా శనివారం కరోనా నుంచి మరణించిన కేసులేవీ లేవు. కరోనా వ్యాప్తి మార్చి ప్రారంభంలో అమెరికా చేరుకుంది. శనివారం మొదటిసారి ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. ఆదివారం ఎన్‍వైసీ ఆఫ్‍ హెల్త్ అండ్‍ మెంటల్‍ హైజీన్‍ నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మార్చి 13 తర్వాత తొలిసారి శనివారం నాడు కరోనాకు సంబంధించిన ఎటువంటి మరణాలు సంభవించలేదు. తాజా డేటా ప్రకారం న్యూయార్క్లో 251,924 మందికి కరోనా సోకగా, 18,670 మంది మరణించారు. యునైటెడ్‍ స్టేట్స్ లో కరోనా సోకిన వారి సంఖ్య 33 లక్షలు దాటింది. మరణాల సంఖ్య కూడా 1.35 లక్షలకు చేరుకుంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 135,205 కు పెరిగింది. ప్రస్తుతం కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్‍ రెండవ, భారత్‍ మూడవ స్థానంలో ఉన్నాయి. 7.26 లక్షల  కేసులతో రష్యా నాలుగో స్థానంలో ఉంది.