Google to invest Rs 75000 crore in India says CEO Sundar Pichai

గూగుల్‍ సంస్థ డిజిటల్‍ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టింది. భారతీయ స్టార్ట్ అప్స్లో సుమారు 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్‍ సీఈవో సుందర్‍ పిచాయ్‍ తెలిపారు. గూగుల్‍ ఆఫ్‍ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారీ పెట్టుబడులను ప్రకటించారు. పది బిలియన్ల డాలర్ల నిధులతో భారతీయ డిజిటల్‍ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానున్నట్లు సుందర్‍ పిచాయ్‍ తన ట్విట్టర్‍లో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్‍ ఇండియా విజన్‍తో ప్రధాని మోదీ పనిచేస్తున్న తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.