Delhi High Court Notice to AP CM Jagan YSRCP Party and EC

ఎన్నికల సంఘం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‍ పార్టీ(వైసీపీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్‍ఆర్‍ కాంగ్రెస్‍ అని ప్రచారం చేసి, తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్‍ఆర్‍ కాంగ్రెస్‍ అధ్యక్షుడు మహబూబ్‍ బాషా పిటిషన్‍ దాఖలు చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్‍ రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‍ నేతృత్వంలోని వైకాపాకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను సెప్టెంబర్‍ 17కి వాయిదా వేసింది.