Congress Leader Narendra Yadav dies with Corona Positive

కరోనా మహమ్మారి సోకడంతో హైదరాబాద్‍కు చెందిన కాంగ్రెస్‍ నేత జి.నరేంద్ర యాదవ్‍ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన వివిధ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయనకు వైరస్‍ సోకినట్లు సమాచారం. గాంధీభవన్‍లో ఇటీవల జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ నరేంద్ర పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్‍ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.