Florida reports 15000 new coronavirus cases smashing national record

ఫ్లోరిడాలో ఆదివారం 12 జూలై , 15 వేలకు పైగా కొత్త కరోనావైరస్ కేసులు ప్రకటించబడ్డాయి, ఇది కరోనావైరస్ ప్రారంభమైనప్పటి నుండి ఫ్లోరిడారాష్ట్రంలో ఒకే రోజు అత్యధికంగా నమోదు అయ్యన కరోనావైరస్ కేసులు. ఈ పెరుగుదల ఆసుపత్రులపై ఒత్తిడిని పెంచింది. మయామి-డేడ్ కౌంటీలో వైరస్ కేసులు పెరగడంతో ఆరు ఆస్పత్రులు కరోనావైరస్ కేసులు తో వాటి సామర్థ్యాన్ని చేరుకున్నాయి అని ప్రకటిస్తూ మేయర్ కార్లోస్ జమేనేజ్, కర్ఫ్యూ విధించడం ద్వారా లాక్డౌన్ సడలింపు ప్రణాళికలను వెనక్కి తీసుకున్నారు. మరియు రెస్టారెంట్లులో డైనింగ్ మూసివేయబడ్డాయి. ఖచ్చితంగా కరోనావైరస్తో ఆసుపత్రికి వెళ్ళే వారి సంఖ్య,ఐసియూ లోని వ్యక్తుల సంఖ్య మరియు వెంటిలేటర్లలోని వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మాకు ఇంకా సామర్థ్యం ఉంది, కానీ ఇది నాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. అని మేయర్ కార్లోస్ జమేనేజ్ అన్నారు

ఫ్లోరిడా కొత్త కరోనా వైరస్ కేసుల నమోదులో న్యూయార్క్ రెకార్డని బ్రేక్ చేసింది.ఇప్పటిదాకా న్యూయోర్క్ లో 12000 కరోనా కేసులను నమోదులయ్యాయి. కానీ ఫ్లోరిడా న్యూయార్క్ కంటే చాలా తక్కువ మరణాలను నివేదిస్తోంది.ఫ్లోరిడా మయామి, ఫోర్ట్ లాడర్డేల్, ఓర్లాండో, ఫోర్ట్ మైయర్స్, వెస్ట్ పామ్ బీచ్, పెన్సకోలా మరియు సరసోటాతో సహా ఫ్లోరిడా యొక్క అతిపెద్ద నగరాలను కలిగి ఉన్న కౌంటీలలో ఒకే రోజు రికార్డులను చూసింది.