Amazon Snags Rights to New York Times Jungle Prince of Delhi

దిన్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన జంగిల్‍ ప్రిన్స్ ఆఫ్‍ ఢిల్లీ కథ హక్కులను అమెజాన్‍ స్టూడియోస్‍ దక్కించుకుంది. దీన్ని ప్రముఖ భారతీయ దర్శకురాలు మీరా నాయర్‍ అమెజాన్‍ ఒరిజినల్‍ సిరీస్‍గా నిర్మించనున్నారని న్యూయార్క్ టైమ్స్ స్కిప్టెడ్‍ ఎంటర్‍టెయిన్‍మెంట్‍ విభాగం హెడ్‍ రూపర్‍ వెల్లడించింది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఓ రాచకుటుంబానికి చెందిన కథ ఇదని, 2020 సంవత్సరంలో పులిట్జర్‍  ఫ్రైజ్‍ ఫైనలిస్ట్ ఇలాన్‍ బ్యారీ దీన్ని రచించారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలవారికీ నచ్చేలా ఇతివృత్తం ఉంటుందని అన్నారు.