indian-students-fear-deportation-losing-semester-over-us-visa-rule

అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆన్‍లైన్‍ మాధ్యమంలో విద్యనభ్యసించాలనుకుంటున్న విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని డొనాల్డ్ ట్రంప్‍ సర్కార్‍ జారీ చేసిన తాజా ఉత్తర్వులు భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలను రేపుతున్నాయి. సెమిస్టర్‍ మధ్యలో కోర్సును వదిలి ఎలా వెళ్తామని కొందరు విద్యార్థులు ప్రశ్నిస్తుండగా, తీసుకున్న విద్యారుణాల్ని ఎలా చెల్లించాలని మరికొందరు వాపోతున్నారు. కరోనా ఉద్ధవృతి కొనసాగుతున్న ఇలాంటి సమయంలో విద్యార్థులపై కఠిన ఆక్షలు సరికావని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాల ప్రణాళికలతో అమెరికా వచ్చే విద్యార్థులకు ఇది పిడుగులాంటి వార్త. సెమిస్టర్‍ మధ్యలో దేశాన్ని విడిచి వెళ్లమంటే ఎలా? కోర్సు పై తీసుకున్న విద్యార్ధుణాన్ని ఎలా చెల్లించాలి? ఒక్కసారి అమెరికా విడిచి వెళ్లాక, తిరిగి రాగలనా? ఊఅమెరికాలో ఉదయం అయితే, భారత్‍లో రాత్రి అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఇండియాక వెళ్లాక, ఆన్‍లైన్‍ క్లాసులకు హాజరవ్వడం ఇబ్బందిగా ఉండదా? అని డ్యూక్‍ యూనివర్సిటీ విద్యార్థిని శోభన ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.