Telangana Congress to Launch Speak Up Telangana online Social Media Campaign on July 18

కరోనాపై రాష్ట్ర ప్రజల ఆందోళన వినిపించడానికి ఈ నెల 18న స్పీక్‍ ఆప్‍ తెలంగాణ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కొవిడ్‍ 19 టాస్క్ఫోర్స్ చైర్మన్‍ మర్రి శశిధర్‍రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్యం, విద్య సమస్యలను చర్చించడానికి టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో ఆదివారం జూమ్‍ యాప్‍ ద్వారా వీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‍ తదితరులు పాల్గొన్నారన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడానికి క్యాబినెట్‍ భేటీ జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.