48 COVID 19 positives detected at Telangana Raj Bhavan

తెలంగాణ రాజ్‍భవన్‍లో కరోనా కలకలం సృష్టించింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న 28 మంది పోలీసు సిబ్బందికి, పదిమంది రాజ్‍భవన్‍ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులు మరో పదిమందికి కలిపి మొత్తం 48 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. గవర్నర్‍ తమిళిసై, అధికారులు సైతం పరీక్షలు చేయించుకోగా వారికి నెగెటివ్‍ వచ్చింది. శని, ఆదివారాల్లో రాజ్‍భవన్‍ ర్యాపిడ్‍ యాంటిజెన్‍ పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బెటాలియన్‍ సిబ్బంది 395 మందికిగాను 347 మందిని పరీక్షించగా 28 మందికి పాజిటివ్‍ వచ్చింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు. తర్వాత రాజ్‍భవన్‍ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ముందుజాగ్రత్తగా పరీక్షలు చేయగా 10 మంది సిబ్బందికి, 10 మంది కుటుం సభ్యులకు పాజిటివ్‍గా తేలింది. వారిని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా పరీక్షల గురించి గవర్నర్‍ స్వయంగా ట్విటర్‍ ద్వారా వెల్లడించారు. రెడ్‍జోన్ల్లో ఉన్న వారు, రోగులను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.