Indian Army to place order for 72000 American assault rifles

సైనిక దళాల ఆధునీకరణలో భాగంగా అమెరికా నుంచి 72 వేల సిగ్‍ సుయెర్‍ అస్సాల్ట్  రైఫిళ్లను భారత ఆర్మీ కొనుగోలు చేసింది. లద్దాఖ్‍లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలతో ఘర్షణ కొనసాగుతున్న సమయంలోనే ఈ కొనుగోలు పక్రియ పూర్తి కావడం విశేషం. కాలం చెల్లిన ఆయుధాల స్థానంలో భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని సైన్యం గతంలోనే నిర్ణయించింది. విదేశాల నుంచి లైట్‍ మెషిన్‍ గన్స్, బ్యాటిల్‍ కార్పైన్స్, అస్సాల్ట్ రైఫిళ్లు కొనుగోలు చేస్తోంది.